Header Banner

మాకు శక్తివంతమైన బ్రాండ్ ఉంది, అది ఆయనే.! లోకేశ్ కీలక వ్యాఖ్యలు!

  Fri May 16, 2025 15:50        Politics

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఏపీకి వివిధ సంస్థ‌లు భారీ పెట్టుబ‌డులు పెట్ట‌డానికి సీఎం చంద్ర‌బాబు బ్రాండే దోహ‌ప‌డింద‌న్నారు. అనంత‌పురం జిల్లా గుత్తి మండ‌లం బేత‌ప‌ల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్‌కు శుక్ర‌వారం నాడు మంత్రి లోకేశ్ భూమిపూజ చేశారు. 2,300 ఎక‌రాల్లో రూ.22 వేల కోట్ల‌తో దీన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... రాయ‌ల‌సీమ‌లో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ ఏర్పాటుతో ప‌దివేల మందికి ఉద్యోగాలు క‌ల్పించే బాధ్య‌త తీసుకుంటామ‌ని లోకేశ్ చెప్పారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువ‌త‌కు 20 లక్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని తెలిపారు. ఏపీ గ‌డ్డ‌పై ఉత్ప‌త్తి అయ్యే విద్యుత్ రాష్ట్రానికే కాకుండా... దేశ అవ‌స‌రాల‌కు కూడా ఉప‌యోగ‌ప‌డనుంద‌ని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టుల‌తో విద్యుత్ ఛార్జీలు త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం రోడ్ల‌పై గుంత‌ల‌ను పూడ్చలేక‌పోయింద‌ని దుయ్య‌బ్ట‌టారు. ఒక్క పెట్టుబ‌డి కూడా తీసుకురాలేక‌పోయార‌న్నారు. అలాంటిది, ఇప్పుడు టీసీఎస్, టాటా ఎన‌ర్జీతో పాటు పలు ప్ర‌ముఖ సంస్థులు పెట్టుబ‌డులు పెడుతున్నాయ‌ని అన్నారు. త్వ‌ర‌లోనే క‌ర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామ‌ని మంత్రి లోకేశ్ చెప్పారు. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting